పిల్లల కథల్లో గానీ, పెద్దల కథల్లో గానీ ఏదో ఒక ప్రయోజనం ఆశించి రచయితలు కథలు వ్రాస్తారు. వాటిని పిల్లలు చదివి లేదా విని తమలోని జ్ఞాన దీపాన్ని వెలిగించుకొని తద్వారా తమను తాము ఉద్ధరించుకొని, సంఘశ్రేయస్సుకు పాటుపడతారనే ఆకాంక్ష వారిది.కథలు పిల్లలకు వివేకాన్ని, విజ్ఞానాన్ని ఆచరణాత్మక ప్రయోజనాన్ని కలిగిస్తాయి.ఎంతో మంది వ్యక్తులను చూస్తుంటాము. బయటికి కనపడేది వారి బాహ్య సౌందర్యం. కానీ వారి పరిచయాలతో మనకు మరొక్కటి కూడా కనపడతుంది. అది వారి అంతర్గత సౌందర్యం. ఆరెంటి నడవడిక శీలమని అంటాము. రెండవది బయటకు కనపడదు. మనస్సుతో, బుద్ధితో మాత్రమే చూడగలము. ఆ వ్యక్తులను దగ్గరిగా గమనిస్తేనే వారి అంతర ప్రవర్తన బయట పడుతుంది. అప్పుడు తెలుస్తుంది వారి అసలు స్వరూపం, వారు మంచివారా? నమ్మదగిన వారా ? కాదా అని. కొందరు మాటలతో మసిపూసి మారేడుకాయ చేస్తారు. వాళ్లు బయటికి చెప్పేది ఒకటి చేసేది మరొకటి. అట్లాంటి వారు మాటలతో బోల్తా కొట్టిస్తారు. అందుకే అట్టి వారి విషయంలో జాగ్రత్త పడాలని కథలు సూచిస్తాయి.ఈ కథలను పెద్దలు చదువుకొని, పిల్లలకు చెబితే కథలకు ప్రాణం పోసినట్లవుతుంది. బాలలంటే 16 సంవత్సరముల వయస్సులోపు వారని నిఘంటు